నన్నయ్యలో కామయ్య : కీచక ప్రొఫెసర్

నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఘటన కలకలం సృష్టిస్తోంది. ఎంఏ ఇంగ్లీషు విద్యార్థినులను డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత విద్యార్థినులు సీఎం జగన్‌కు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. స్పెషల్ క్లాసులంటూ తన ప్లాటుకు పిలిపించుకుని వేధించేవాడని లేఖలో తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. దీనిపై వెంటనే సీఎం జగన్ స్పందించారు. విచారణ చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు మహిళా అధ్యాపకులకు సైతం వేధింపులు తప్పలేదని తెలుస్తోంది. వర్సిటీ అధికారుల విచారణపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో సెలవుల కారణంగా విచారణ కొంత ఆలస్యంగా జరుగుతోంది. ఇతర డిపార్ట్ మెంట్‌లోనూ ఇలాంటి వేధింపులున్నాయనే ప్రచారం జరగుతోంది. ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర ఇంగ్లీషు డిపార్ట్ మెంట్‌కు హెచ్‌వోడీగా ఉన్నాడు. అసభ్య సందేశాలు పంపేవాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. స్పెషల్ క్లాసులంటూ ప్లాట్‌కు పిలిపించుకుని వెకిలి చేష్టలకు దిగేవాడని ఆరోపించారు. ఈ ఘటనపై వీసీ సురేష్ వర్మ స్పందించారు. విచారణకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, రూల్స్ ప్రకారం..ఉమెన్ సెల్‌కు రిఫర్ చేయడం జరిగిందన్నారు. విచారణ అనంతరం కేసు ప్రాధాన్యతను బట్టి..కమిటీ వేయడం జరుగుతుందన్నారు. విచారణ అనంతరం చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటామని వెల్లడిస్తున్నారు.
Read More : చిరు – సీఎం జగన్ భేటీ : పవన్ స్పందన ఎలా ఉంటుందో