ఈవీఎంల మొరాయింపు : కృష్ణా జిల్లాలో ఇంకా కొనసాగుతున్న పోలింగ్

  • Published By: veegamteam ,Published On : April 11, 2019 / 03:42 PM IST
ఈవీఎంల మొరాయింపు : కృష్ణా జిల్లాలో ఇంకా కొనసాగుతున్న పోలింగ్

Updated On : April 11, 2019 / 3:42 PM IST

కృష్ణా జిల్లాలో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంల మొరాయింపుతో 2 నుంచి 4 గంటల వరకు ఆలస్యంగా అయింది. దీని ప్రభావంతో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. మచిలీపట్నం, గన్నవరం, చల్లపల్లి, బాపులపాడు, గుడవాడ, మైలవరంలో పోలింగ్ కొనసాగుతోంది. భారీగా క్యూలైన్లలో నిలిచి ఉన్నారు. ఇంకా రెండు, మూడు గంటల వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 

గన్నవరం మండలం గొల్లనపల్లిలో భారీగా ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. చల్లపల్లిలోని 80వ బూత్, బాపులపాడు మండలం కానుమోలులో పోలింగ్ కొనసాగుతోంది. మైలవరం నియోజకవర్గం జక్కంపూడిలో ఓటేయడానికి ఓటర్లు ఎదురు చూస్తున్నారు. గుడవాడ 11, 14, 15వ బూత్ లలో పోలింగ్ కొనసాగుతోంది.