జగన్ అంటే మ్యాన్ ఆఫ్ Friday: నేను ప్రజలకు దత్త పుత్రుడిని

వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే విఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఇసుక సరఫరా ఆగిపోయి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. విశాఖ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్. నిర్మాణాలు ఆగిపోతే ఎంత అభివృద్ధి ఆగిపోతుందో వైసీపీ నేతలకు తెలియడం లేదన్నారు.
ఇదే సమయంలో మంత్రి కన్నబాబుపై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. కన్నబాబుని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది మేము. నాగబాబు గారే ఆయనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మంత్రులుగా అయ్యి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని విమర్శించారు. మాటకు ముందు వైసీపీ నాయకులు తనని చంద్రబాబు దత్తపుత్రుడు, టీడీపీ బీ-టీమ్ అని అంటున్నారని, నేను టీడీపీ పాలసీలను విభేదించి బయటకొచ్చానని. నేను ప్రజలకు దత్త పుత్రుడిని అన్నారు.
ఇదే సమయంలో ఇప్పటివరకు 10మంది చనిపోయారు అనుకున్నా.. 36మంది కార్మికులు చనిపోయారంట.. అయినా కూడా వైసీపీ నిద్రమత్తు వదలలేదని అన్నారు పవన్ కళ్యాణ్. జగన్ అంటే మ్యాన్ ఫ్రై డే అని ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారంటూ విమర్శించారు పవన్ కళ్యాణ్.