పవన్ కళ్యాణ్ కు నో ఎంట్రీ : టమాటా మార్కెట్ సందర్శనకు నిరాకరణ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మదనపల్లె టమాట మార్కెట్ యార్డు కమిటీ ఝలక్ ఇచ్చింది. మార్కెట్ సందర్శనకు రావొద్దని తెలిపింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మదనపల్లె టమాట మార్కెట్ యార్డు కమిటీ ఝలక్ ఇచ్చింది. మార్కెట్ సందర్శనకు రావొద్దని తెలిపింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మదనపల్లె టమాట మార్కెట్ యార్డు కమిటీ ఝలక్ ఇచ్చింది. మార్కెట్ సందర్శనకు రావొద్దని తెలిపింది. గురువారం(డిసెంబర్5, 2019) మదనపల్లె మార్కెట్ ను పవన్ సందర్శించి, అక్కడున్న రైతులతో సమావేశం కావాలని పవన్ ప్లాన్ చేసుకున్నారు.
అయితే ఇప్పటికే టమాటా సీజన్ మొదలవ్వడంతో పవన్ వస్తే అక్కడ తీవ్ర ఇబ్బందులొస్తాయని సందర్శనకు అనుమతి నిరాకరించింది. పవన్ పర్యటన వల్ల మార్కెట్ కు వచ్చేవారికి అసౌకర్యానికి గురవుతారని కమిటీ చెబుతోంది. టమాటసీజన్ ప్రారంభం కావడంతో పవన్ సందర్శన కష్టమని మార్కెట్ కమిటీ తెలిపింది. మార్కెట్ అధికారుల తీరుపై జనసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపు ఉదయం 10 గంటలకు మదనపల్లెలోని టమాట మార్కెట్ ను పవన్ సందర్శించాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితం ఆయన మదనపల్లెకు వెళ్లారు. ఈలోగానే మదనపల్లె మార్కెట్ యార్డు అధికారులు ఒక్కసారిగా ఆయనకు ఝలక్ ఇచ్చారు. స్వయంగా మార్కెట్ యార్డు కమిటీ కార్యదర్శి పేరు మీద ఒక లేఖ విడులైంది. మదనపల్లె మార్కెట్ యార్డు సందర్శనకు పవన్ కళ్యాణ్ కు అనుమతి నిరాకరించామని ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానంగా టమాట సీజన్ మొదలైంది.
ఉదయం నుంచి రైతులు, కొనుగోలుదారులతో మార్కెట్ చాలా బిజీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ మార్కెట్ యార్డులోకి వస్తే మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడి అక్కడున్న వారికి అసౌకర్యం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పవన్ కు మార్కెట్ యార్డులో సందర్శనకు నిరాకరిస్తున్నట్లు లేఖలో అధికారులు లేఖలో పేర్కొన్నారు.
ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారు. మొత్తంగా మార్కెట్ కమిటీ అధికారుల నిర్ణయం వెనుక వైసీపీ నేతల ప్రోత్బలం ఉందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోడం పట్ల నేతలు భగ్గుమంటున్నారు.
కేవలం మార్కెట్ యార్డులోకి వెళ్లి టమాట రేటు, రైతుల ఇబ్బందులు తెలుసుకోవాలని పవన్ భావించారు. మదనపల్లె మార్కెట్.. రాయలసీమలోనే అతి పెద్ద టమాట మార్కెట్. కాబట్టి మార్కెట్ సందర్శనకు పవన్ కు అనుమతి నిరాకరించడంతో ఈ అంశం వివాదాస్పదమవుతోంది. మార్కెట్ అధికారుల నిర్ణయం పట్ల జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.