రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు.. అది రాష్ట్రం ఇష్టమే: పవన్ కళ్యాణ్

  • Published By: vamsi ,Published On : February 15, 2020 / 07:50 AM IST
రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు.. అది రాష్ట్రం ఇష్టమే: పవన్ కళ్యాణ్

Updated On : February 15, 2020 / 7:50 AM IST

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రాజధాని కోసం దీక్షలు చేపట్టిన రైతులకు సంఘీభావం తెలపిన పవన్ కళ్యాణ్.. ఎర్రబాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే పాలన అస్తవ్యస్థం అవుతుంది అని అన్నారు పవన్ కళ్యాణ్. అయితే  ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని, ఆ అవకాశం లేదని అన్నారు. ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వం కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతుందని, రాజధాని ఎక్కడ పెట్టాలి అని నిర్ణయించుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు పవన్ కళ్యాణ్.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ కూడా రాజధాని ప్రాంతంగా అమరావతిడ ఉండడానికి ఒప్పుకున్నారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అలా కాదని జగన్ అంటే కుదరదని అన్నారు. ఇప్పడు రాజధాని మార్చినా కూడా అది తాత్కాలికమే అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

Read Here>>మెరుపు వేగం : ఉసేన్ బోల్ట్ రికార్డ్ ను బద్దలుకొట్టిన భారతీయుడు