ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు : సీఎం జగన్ వ్యాఖ్యలపై పవన్ స్పందన
ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు...జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అయ్యేనా అని ప్రశ్నించారు.

ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు…జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అయ్యేనా అని ప్రశ్నించారు.
ఏపీకి మూడు రాజధానులు అవసరమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక్క అమరావతి రాజధానికే దిక్కు లేదు…జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అయ్యేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన మొదలుకొని ఇప్పటి దాకా ఏపీ ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమి ఒరగలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అసెంబ్లీలో సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం(డిసెంబర్ 17,2019) అసెంబ్లీలో అమరావతి రాజధానిపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏపీలో మూడు రాజధానుల అవసరం ఉందన్నారు. ఏపీకి మూడు రాజధానులు వస్తాయేమోనని సంచలన వ్యాఖ్యాలు చేశారు. పాలన ఒక చోట, జ్యుడీషియల్ మరో చోట ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు, జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటు చేయొచ్చన్నారు.
ఏపీ రాజధానిపై పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేశామని..వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని సీఎం జగన్ చెప్పారు. ఏపీకి బహుశా మూడు రాజధానులు ఉంటాయేమోనని అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక రాజధాని అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని గుర్తు చేశారు. ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పేంటని సీఎం జగన్ ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.