అండగా ఉంటా : రాజధాని ప్రాంతాల్లో పవన్ పర్యటన

రాజధాని ప్రాంత గ్రామాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అమరావతిని తరలించబోతున్నారన్న వార్తలపై రైతులు పవన్‌ను కలిశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు
2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటిస్తారు. రైతులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుంటారు. రాజధాని మార్పుపై పార్టీ విధానాన్ని ప్రకటించనున్నారు.
ఇటీవలే రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు పవన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. రాజధాని తరలించకుండా..చూడాలని వారు కోరారు. దీనిపై స్పందించిన జనసేనానీ..అండగా ఉంటానని హామీనిచ్చారు. గత పాలకులు అవకతవకలకు పాల్పడి ఉంటే..వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదు..రాష్ట్రమంతటిది అన్నారు. రాజధాని సమస్యలపై రైతుల పోరాటానికి మద్దతుగా నిలుస్తానని పవన్ హామీనిచ్చారు.
మరోవైపు రాజధాని అంశంపై సీఎం జగన్ సమక్షంలో సమీక్ష సమావేశం జరిగింది. సమారు రెండు గంటల పాటు రాజధాని భూములు, అమరావతిపై చర్చ జరిగింది. ప్రధానంగా అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న దానిపైనే చర్చ సాగింది. ఈ సమావేశంలో బొత్స, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటన అనంతరం పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.
Read More : కొత్త డిమాండ్ : ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖ
పవన్ షెడ్యూల్ : –
నిడమర్లు, కురగల్లు, ఐనవోలు, కొండవీటివాగు బ్రిడ్జీ, ఎస్.ఆర్.ఎం యూనవర్సిటీ పరిశీలన, శాఖమూరు, విట్ యూనివర్సిటీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ బిల్డింగ్స్, శిల్పారామం, అంబేద్కర్ స్మృతివనం, రిజర్వాయర్ పరిశీలన, ఎన్జీవో క్వార్టర్స్ విజిట్, హైకోర్టు, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణ ప్రదేశాల పరిశీలన, సచివాలయ భవనాల నిర్మాణ స్థలం పరిశీలన, న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల నిర్మాణ ప్రదేశం, ఐఏఎస్, ఎమ్మెల్యే నివాసం టవర్స్, అనంతవరం గ్రామం, ఎన్ 17 రోడ్, అనంతవరం ఎస్ 16 రోడ్, దొండపాడు, సీడ్ యాక్సిస్ రోడ్, సీఆర్డీఏ బిల్డింగ్స్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిశీలన.
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి పర్యటన వివరాలు pic.twitter.com/KHCGhhQVZQ
— JanaSena Party (@JanaSenaParty) August 28, 2019