నువ్వు ఒకటంటే నేను రెండంటా: మోడీ-బాబు మాటల యుద్ధం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మధ్య మాటల తూటాలు పేలాయి.

  • Published By: madhu ,Published On : March 30, 2019 / 03:01 AM IST
నువ్వు ఒకటంటే నేను రెండంటా: మోడీ-బాబు మాటల యుద్ధం

Updated On : March 30, 2019 / 3:01 AM IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మధ్య మాటల తూటాలు పేలాయి.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల సభలో పీఎం మోడీ పాల్గొని బాబుపై పలు విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా బాబు కూడా కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. దీనితో ఏపీలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. 
Read Also : లోకేష్ పప్పు.. పప్పు : జయంతికి.. వర్ధంతికి తేడా తెల్వదు – షర్మిల

మోడీ మాటలు : – 
కర్నూల్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేశారు. ఏదైనా ఒక పథకం ప్రారంభిస్తే అందులో కుంభకోణం జరిగేది… కానీ కుంభకోణాల కోసమే పథకాలను రూపొందిస్తున్నారన్న విషయం ఆంధ్రప్రదేశ్‌ అంతటా చర్చనీయాంశంగా మారిందన్నారు. రాజధాని మొదలుకొని వివిధ పథకాల పేరిట ఏం జరుగుతోందో, ఎవరి ఖజానా నిండుతుందో ప్రజలందరికి తెలుసని విమర్శించారు. ఈ చౌకీదార్‌ అవినీతిని ప్రశ్నించినందుకే ఎన్డీయే నుంచి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని చెప్పారు. 

బాబు కౌంటర్ : –
ప్రధాని వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్‌ ఎటాక్‌ ఇచ్చారు. రాష్ట్రాన్నిఅన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీయేనన్నారు. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని, ఈ విధంగా మోడీ అన్యాయం చేశారన్నారు. దేవుడు పేరు చెప్పుకొనే బీజేపీ.. వెంకటేశ్వరుడి  సాక్షిగా ఆంధ్ర ప్రజలను మోసం చేసిందన్నారు. వెంకటేశ్వరస్వామికి వడ్డి కాసులవాడు అనే పేరు కూడా ఉందని..  వడ్డీతో సహా వసూలు చేస్తాడని మోడీని హెచ్చరించారు. మోడీ  మోసకారి, నయవంచకుడు, నమ్మకద్రోహి అంటూ తీవ్ర స్థాయిలో  మండిపడ్డారు బాబు. వచ్చే ఎన్నికల్లో మోడీని నట్టేట ముంచాలని  ఆయన పిలుపునిచ్చారు. 
Read Also : మీరు SBI కస్టమరా..? మీకు బ్యాంకు విధించే 5 ఛార్జీలు ఏంటో తెలుసా?