కృష్ణా జిల్లాలో కలకలం : లారీలో రూ.1.90 కోట్లు స్వాధీనం
విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు కలకలం చెలరేగింది. కట్టల కట్టల డబ్బు బయటపడింది. కృష్ణా జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. కోటి

విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు కలకలం చెలరేగింది. కట్టల కట్టల డబ్బు బయటపడింది. కృష్ణా జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. కోటి
విజయవాడ: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు కలకలం చెలరేగింది. కట్టల కట్టల డబ్బు బయటపడింది. కృష్ణా జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. కోటి 90లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు దగ్గర పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ లారీలో సిమెంట్ బస్తాల మధ్య నగదుని పెట్టి తరలించడాన్ని గుర్తించారు. ఈ డబ్బుని కంచికచర్ల నుంచి ఏలూరుకు తరలిస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన నగదులో అన్నీ రూ.500, రూ.2వేల నోట్లే ఉన్నాయి.
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు
నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ డబ్బుని తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ జరపుతున్నారు. లారీ డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇన్నాళ్లు ప్రచారం చేసిన పార్టీలు ఇప్పుడు ఓటర్లను ప్రలోపెట్టేందుకు చివరి అస్త్రంగా డబ్బు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఎన్నికల అధికారులు గట్టి నిఘా పెట్టినప్పట్టికి.. డబ్బు తరలింపు ప్రక్రయ జరిగిపోతోంది. కృష్ణా జిల్లాలో మంగళవారం(ఏప్రిల్ 9) రాత్రి నుంచి పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో రూ.30 కోట్లు పట్టుబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు పోలీసుల తనిఖీల్లో రూ.110కోట్లు పట్టుబడినట్టు తెలుస్తోంది.
Read Also : ఎన్నికల్లో..మద్యం,మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్