అశ్విన్ ముందుగా ఓసారి హెచ్చరిస్తే బాగుండేది

ఐపీఎల్ 2019లో భాగంగా రాజస్థాన్ రాయల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల మధ్య సోమవారం మార్చి 25న జరిగిన మ్యాచ్‌లో అశ్విన్.. జోస్ బట్లర్ ను అవుట్ చేసిన విధానం చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారిలో టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కూడా చేరిపోయాడు.
Read Also : కష్టాల్లో ఉన్నాడేమో : రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టులో ధోనీ
‘అశ్విన్ రూల్స్‌కు అనుగుణంగానే ఆడాడు. ఇలా చేయడంలో నాకు తప్పేం కనిపించడం లేదు. అతని హక్కులను సద్వినియోగం చేసుకున్నాడు. కానీ, వ్యక్తిగతంగా ఒకసారి బట్లర్‌ను హెచ్చరిస్తే బాగుండేదని అనుకుంటున్నా. అది నా పర్సనల్ చాయిస్ అభిప్రాయం మాత్రమే. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించాలని అనుకుంటాను. అందుకనే ఈ చర్యను అంగీకరించలేకపోతున్నా’
‘తన హక్కులను వినియోగించుకోవడం అందరికీ నచ్చకపోవచ్చు. అంతమాత్రాన అతని క్యారెక్టర్‌ను పూర్తిగా నెగెటివ్‌గా చూడాలనుకోకూడదు. నా వరకూ వస్తే కచ్చితంగా ముందే హెచ్చరించేవాడిని. జెంటిల్‌మాన్‌లా ఉండాలనుకోవడం ప్రాధాన్యత కాదు. అతని క్యారెక్టర్ నిర్ణయించడానికి ఇది సమయం కాదు. అతను ఎవర్ని మోసం చేయలేదు. చెడుగానూ ప్రవర్తించలేదు’ అని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
Read Also : ఐపీఎల్‌లో స్లెడ్జింగా: వాట్సన్‌పై ఇషాంత్ రెచ్చిపోయాడు