డాక్టర్ కావాలనే కోడెల లక్ష్యం వెనుక అసలు కారణం ఇదే

కోడెల శివప్రసాద్ రాజకీయాల్లో ఎన్నో విజయాల్ని సాధించిన నేత. టీడీపీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న కోడెల మరణంతో పార్టీ శ్రేణులంతా దిగ్ర్భాంతికి గురయ్యారు. 1983 లో డాక్టర్ వృత్తి నుంచి టీడీపీలో చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. అనంతరం రెండుసార్లు ఓటమిపాలైనా..2014లో ఏపీ అసెంబ్లీకి సత్తెనపల్లి నుంచి గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.
గుంటూరు జిల్లా..నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబం 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించారు. తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ.5వ తరగతి వరకూ కండ్లగుంట చదివిన కోడెల సిరిపురం, నర్సరావుపేటలో 10వ క్లాస్ చదివారు. విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివారు. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే కోడెలను డాక్టర్ కావాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఆర్ధిక స్తోమత అంతంతమాత్రగానే ఉన్న ఈ రోజుల్లో డాక్టర్ చదవాలనుకోవటం పెద్ద సాహసమనే చెప్పాలి. కానీ తాతగారి ప్రోత్సాహంతో డాక్టర్ చదవాలని నిర్ణయించుకున్నారు. కానీ కోడెలకు వచ్చిన మార్కులకు మెడికల్ సీటు రాలేదు. కానీ పట్టుదలతో గుంటూరులోనే మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు మెడికల్ కాలేజ్ లో సీటు సంపాదించారు. అలా ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అనంతరం యూపీలోని వారణాసిలో ఎం.ఎస్ చదివారు.
నరసరావుపేటలో హాస్పిటల్ డాక్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేశారు. మంచి డాక్టర్ గా పేరు తెచ్చుకున్ని కోడెల శివప్రసాద్ పై టీడీపీ అధినేత దివంగత ఎన్టీఆర్ దృష్టి పడింది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరి మొదటిసారిగా అతడు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. అలా అంచెలంచెలుగా ఎదిగారు కోడెల శివప్రసాద్.