కరోనా వైరస్ పేరుతో దోపిడీ : ఖమ్మం మిర్చిమార్కెట్‌లో పతనమైన ధరలు.. కొనుగోళ్లు నిలిపివేత
కరోనా వైరస్ పేరు చెప్పి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు.

కరోనా వైరస్ పేరు చెప్పి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు.
కరోనా వైరస్ పేరు చెప్పి మిర్చి వ్యాపారులు దోపిడీకి తెర తీశారు. కమీషన్ ఏజెంట్లు ధరలు భారీగా తగ్గించారు. చైనాలో ప్రబలిన ఈ వైరస్‌తో ఖమ్మం మార్కెట్ యార్డ్‌లో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లను నిలిపి వేశారు. అంతేకాదు.. ధరలు కూడా ఒక్కసారిగా పతనమయ్యాయి. నిన్నా మొన్నటి వరకు క్వింటాలు మిర్చి రేటు 17 వేల రూపాయల నుంచి రూ.22 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.8 వేల నుంచి రూ.10 వేల రూపాయలకు పడిపోయింది. కొనుగోళ్లు నిలిపివేయడంతో ఆందోళనకు దిగారు. అన్నదాతలకు పోలీస్‌లు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మిర్చి రైతులు ఆందోళన విరమించారు.
కరోనా వైరస్ ప్రభావంతో మిర్చి మార్కెట్‌లో ధరల సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉంది అధికారులు అంచనా వేస్తున్నారు. చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులు కొనుగోళ్లను తగ్గించడంతోపాటు ధరల్లో కోత పెట్టారు. ఇప్పటికే భారీగా పతమైన మిర్చి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు, మార్కెట్ కమిటిల చైర్మన్లు చెబుతున్నారు. చైనాకు మిర్చి ఎగుమతులు నిలిచిపోయాయని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ మద్దినేని వెంకటరమణ అన్నారు.
కొనుగోళ్లను వ్యాపారులు భారీగా తగ్గించారని తెలిపారు. ఇప్పటికే మిర్చి ధరలు భారీగా పతనమయ్యాయని.. రానున్న రోజుల్లో మరింత తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. మార్కెట్‌కు మిర్చి తీసుకొచ్చే విషయంలో రైతులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.