బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కారుకు ప్రమాదం: భార్యా..కుమార్తెకు గాయాలు  

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 06:57 AM IST
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కారుకు ప్రమాదం: భార్యా..కుమార్తెకు గాయాలు  

Updated On : November 27, 2019 / 6:57 AM IST

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నటుడు సంపూర్ణేష్ బాబు కారుకి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేశ్ బాబు తృటిలో తప్పించుకున్నారు. కొద్దిపాటి గాయాలతో బైటపడ్డారు. కానీ ఆయన భార్య, కుమార్తెకు గాయాలయ్యాయి.

సిద్దిపేట కొత్త బస్టాండ్ సమీపంలో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారును ఓ ఆర్టీసీ బస్ ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సంపూర్ణేష్ బాబు, ఆయన భార్య, కుమార్తె స్వల్ప గాయాలతో బైటపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంపూ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సంపూర్ణేశ్ బాబు అసలు  పేరు నరసింహాచారి. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన సంపూ.. బర్నంగ్ స్టార్ గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. హృదయకాలేయం సినిమా తర్వాత కొబ్బరిమట్ట సినిమా కూడా సంపూర్ణేష్ బాబు నటించారు. సంపూ స్వగ్రామం సిద్దిపేట సమీపంలోని మిట్టపల్లి.