మీ కాళ్లు కడుగుతా : సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం

  • Published By: madhu ,Published On : January 23, 2019 / 02:04 PM IST
మీ కాళ్లు కడుగుతా : సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం

Updated On : January 23, 2019 / 2:04 PM IST

పెద్దపల్లి : కూటి కోసం కోటి పాట్లు అన్న నానుడికి చెక్ పెట్టేసి…ఓటు కోసం కోటి పాట్లు పడుతున్నారు అభ్యర్ధులు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించడానికి నానాతంటాలు పడుతున్నారు.  పెద్దపల్లి జిల్లాలోని  ఓ సర్పంచి అభ్యర్ధి …  అందరి కంటే భిన్నంగా ఓట్లు అడుగుతూ చేస్తోన్న ప్రచారం ఇపుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 
సాధారణంగా ప్రత్యేక సందర్భాలలోనో…ఫంక్షన్లలోనో  పెద్దవాళ్లను గౌరవించడం చూస్తుంటాం. అయితే మీకు దండంపెడతా… మీ కాళ్లు కడుగుతా అంటూ ప్రసన్నం చేసుకుంటుంది మాత్రం వీరికి ఏరకంగానూ బంధువు కాదు. నాకు ఓటేయండి మీకు పుణ్యమంటాందంటూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్న పెద్దకల్వల గ్రామ సర్పంచి అభ్యర్ధి కల్వల రమేష్. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలంలో  పెద్దకల్వల గ్రామంలో పోటాపోటీగా ప్రచారాలు సాగుతున్నాయి. దీంతో ప్రత్యర్ధులకు దిమ్మతిరిగే ప్రచారం మొదలెట్టి ఓటర్లను ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు కల్వల రమేష్. ఉంగరం గుర్తుకు ఓటేయ్యండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని గ్రామస్ధుల కాళ్లు కడిగి వాళ్లను తెగ ఐస్ చేసేస్తున్నాడు. మరి కల్వల కాళ్ల కడుగుడు ప్రచారం ఏవిధంగా అతని గెలుపునకు ఉపయోగపడుతుందో అన్నది వేచి చూడాల్సిందేనని గ్రామస్థులు అంటున్నారు.