రాజుల జిల్లాలో ఏడు సీట్లు ఖరారు

  • Published By: vamsi ,Published On : March 15, 2019 / 07:21 AM IST
రాజుల జిల్లాలో ఏడు సీట్లు ఖరారు

Updated On : March 15, 2019 / 7:21 AM IST

బొబ్బిలి ప్రాంతం పేరు వినగానే చారిత్రక నేపథ్యం గుర్తుకు వస్తుంది. ఆనాడు విజయనగరం, బొబ్బిలి సంస్థానాల మధ్య జరిగిన యుద్ధం.. బొబ్బిలి యుద్ధంగా చరిత్ర ప్రసిద్ధికెక్కిన విషయం తెలిసిందే. నాటి బొబ్బిలి చారిత్రక నేపథ్యం…నేడు రాజకీయపరంగానూ కొనసాగుతుంది.

ఇక్కడి రాజవంశీకుల పాలన నాటి నుంచి నేటి వరకు ఎదురులేని విధంగా కొనసాగుతుంది. రాజకీయాల్లో మిత్రులుండరు..శత్రువులుండరు. నిన్న మొన్నటి వరకు వేర్వేరు రాజకీయ పార్టీల్లో పదవులను అనుభవించిన వారంతా..ఇప్పుడు ఒకే గొడుకు కిందకు చేరారు. విజయనగరం జిల్లాలోని నలుగురు ప్రధాన సంస్థానాధీశులు టీడీపీ పార్టీలో చేరి.. సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు.

నాటి వైరాన్ని, రాజకీయ ద్వేషాలను పక్కన పెట్టి పోటీ చేస్తున్నారు. విజయనగరం, బొబ్బిలి, కురుపాం, చినమేరంగి సంస్థానాల సంస్థానాదీశులు నాటి రాచరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ తమ ప్రతిష్టను కాపాడుకుంటూ వస్తున్నారు. రాజుల జిల్లాగా పేరుగాంచిన విజయనగరం జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు గాను 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 2 స్థానాలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల అభ్యర్ధులను చంద్రబాబు ఖరారు చేయలేదు. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
బీసీలు -2
ఓసీలు- 2
ఎస్సీలు-1
ఎస్టీలు- 2

విజయనగరం జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:

బొబ్బిలి – సుజయ్ కృష్ణ రంగారావు.
ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి.
సాలూరు – ఆర్‌పీ బాంజుదేవ్
పార్వతీపురం – బొబ్బిలి చిరంజీవులు
కురుపాం -జనార్థన్ దాట్రజ్
గజపతి నగరం-కేఏ నాయుడు
చీపురుపల్లి- కిమిడి నాగార్జున

ఖరారు కాని స్థానాలు:
నెల్లిమర్ల
విజయనగరం