వివేకా మృతిపై సోనియా దిగ్ర్భాంతి: ఆయన సేవలు మరవలేం 

  • Published By: veegamteam ,Published On : March 17, 2019 / 03:55 AM IST
వివేకా మృతిపై సోనియా దిగ్ర్భాంతి: ఆయన సేవలు మరవలేం 

Updated On : March 17, 2019 / 3:55 AM IST

ఢిల్లీ : వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మృతి  విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు   సోనియాగాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లోక్ సభ ఎంపీగా ఆయన సేవల్ని మరువలేమనీ..ఆయన వినయ విధేయతలు..తనకింకా గుర్తున్నాయనీ..ఆయన మరణంతో కుటుంబం ఎంతటి వేదనకు గురవుతుందో తాను అర్థం చేసుకోగలని వివేకా భార్య సౌభాగ్యకు సంతాప సోనియా సందేశాన్ని లేఖ ద్వారా  పంపించారు సోనియాగాంధీ. 

వివేకా మృతికి దారి తీసిన కారణాలు ఏవైనా  నిష్పక్షపాతంగా జరిపే దర్యాప్తులో వెల్లడవుతాయని తాను  భావిస్తున్నట్టు సోనియా  తెలిపారు. లోక్ సభలో ఎంపీగా రాష్ట్రం కోసం ఆయన ఎంతో తపన పడేవారని ఈ సందర్భంగా తనకు గుర్తుకొచ్చాయని తెలిపారు. వివేకా మృతి ఆయన కుటుంబానికి..తీవ్ర సంతాపాన్ని  తెలిపారు. ఆయన భార్యకు..పిల్లలు..బంధువులు..అంతా ఆత్మస్థైర్యాన్ని పొందాలని..ధైర్యంతో ముందుకు కొనసాగాలని తాను కోరుకుంటున్నానని   సంతాపం సందేశంలో సోనియా తెలిపారు.