హైకోర్టులో ఏపీకి ఎదురుదెబ్బ :అధికారులను బదిలీ చేయాల్సిందే

ఐపీఎస్‌ల బదిలీలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

  • Published By: madhu ,Published On : March 29, 2019 / 05:32 AM IST
హైకోర్టులో ఏపీకి ఎదురుదెబ్బ :అధికారులను బదిలీ చేయాల్సిందే

Updated On : March 29, 2019 / 5:32 AM IST

ఐపీఎస్‌ల బదిలీలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

ఐపీఎస్‌ల బదిలీలపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు ఐపీఎస్‌లను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ.. చంద్రబాబు సర్కార్‌ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. దీనిపై మార్చి 29వ తేదీ శుక్రవారం కోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున లాయర్..ఈసీ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. 
ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలపై హైకోర్టు జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
Read Also : వేడికి ఉపశమనం : ఉల్లిగడ్డలను పంచిన జోగు రామన్న

ఈసీ ఆదేశాలను సమర్ధించింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలను బదిలీ చేయాలన్న ఈసీ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది కోర్టు. ఈసీ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఎందుకు సవాల్ చేస్తుంది అనే విషయాలను కూడా లాయర్ వివరించారు. వీటితో ఏకీభవించలేదు కోర్టు. ఈసీ ఆదేశాలకే కట్టుబడి ఉండాలని సూచించింది. 

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 28ఏ ప్రకారం ఎన్నికల పరిధిలోకి రాని అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం కోర్టులో సవాల్‌ చేసింది. ప్రత్యేకించి ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేయడం ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని ఏజీ వాదనలు వినిపించారు. 
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ