ప్రియాంక నిందితులను ఉరితీయాలి : 3 అంతస్తుల భవనమెక్కిన విద్యార్థి

ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి కలకలం సృష్టించాడు.

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 04:58 AM IST
ప్రియాంక నిందితులను ఉరితీయాలి : 3 అంతస్తుల భవనమెక్కిన విద్యార్థి

Updated On : December 1, 2019 / 4:58 AM IST

ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి కలకలం సృష్టించాడు.

ఖమ్మం జిల్లాలోని వైరాలో రోహిత్ అనే డిగ్రీ విద్యార్థి హల్ చల్ చేశాడు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మూడు అంతస్తుల భవనం ఎక్కి కలకలం సృష్టించాడు. నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. నిందితులను ఉరితీయకపోతే బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. 

అత్యాచారం చేసి, కాల్చి చంపిన వారిని ఉరితీయాల్సిందేనని రోహిత్ పట్టుబట్టారు. నిందితులను ఉరితీయకపోతే ఇక్కడ ఒక ప్రాణం పక్కాగా పోతుందని హెచ్చరించారు. తాను నిర్ణయం తీసుకున్నాకే బిల్డింగ్ పైకి ఎక్కానని తెలిపారు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టమన్నారు. ఈ సోసైటీలో బతకడానికి తనకు ఇష్టం లేదని చెప్పారు. ఐ హేట్ ఇండియా అని అన్నాడు. 

స్థానికులు, పోలీసులు కిందికి దిగమని ఎంత బతిమాలినా..రోహిత్ ససేమిరా అంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అతన్ని కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. యువత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. వారిని తమకు అప్పగించాలని, తామే చంపేస్తామని అంటున్నారు.