టీడీపీ మేనిఫెస్టో : గెలిస్తే రూ.3వేల పింఛన్

ఎన్నికల నామినేషన్ గడువు కూడా పూర్తి కావస్తుంది. అయితే పార్టీలు మాత్రం మేనిఫెస్టోలను విడుదల చేయట్లేదు. ఈ క్రమంలో తెలుగుదేశం మేనిఫెస్టోలో చేర్చిన ముఖ్యమైన అంశం గురించి చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటివరకు ఇస్తున్న రూ.2వేల పించన్‌ను రూ.3వేలకు చేస్తామని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ప్రకటించారు.
ఈ మేరకు మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పెట్టినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల సమయంలో రూ.200 ఉన్న పించన్‌ను ఎన్నికల తర్వాత రూ.1000 చేసి తరువాత రూ.2వేలకు పెంచిన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రూ.3,000 చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు.
అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు అధికారం కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చంద్రబాబు కార్యకర్తలతో అన్నారు. మరోవైపు వైసీపీ కూడా ఎన్నకల్లో గెలిస్తే రూ.3వేల పించన్ ఇస్తామంటూ ప్రకటించింది.