జగన్ ,అండ్ గ్యాంగ్ నుంచి విశాఖకు ప్రమాదం..ఆ దేవుడే రక్షించాలి : కేశినేని నాని 

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 04:54 AM IST
జగన్ ,అండ్ గ్యాంగ్ నుంచి విశాఖకు ప్రమాదం..ఆ దేవుడే రక్షించాలి : కేశినేని నాని 

Updated On : December 23, 2019 / 4:54 AM IST

పాకిస్థాన్ నుండి విశాఖను రక్షించేందుకు భారతదేశ సైన్యం వుంది..కాపీ విశాఖపట్నానికి అసలు  ముప్పు ప్రస్తుతం మన సీఎం జగన్నన అండ్ గ్యాంగ్ నుంచి ఉందని వీళ్ళ నుండి విశాఖను దేవుడే రక్షించాలి అంటూ టీడీపీ నేత కేశినేని నాని ట్విట్టర్ ద్వారా వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. 

కాగా..ఏపికి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ  క్రమంలో విశాఖ సమీపంలోని భీమిలీలు రాజధాని ఏర్పాటు బాగుంటుందని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. దీంట్లో భాగంగానే వైసీపీ నేతలు విశాఖ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో భారీగా భూములు కొన్నారనీ..ఇక సామాన్యుల భూముల్ని కూడా ఆక్రమించుకుని వైసీపీ నేతలు చేసే అరాచకాలకు విశాఖపట్నంలోని భూములు బలైపోతాయని ఇక ..వైసీపీ నేతల అరాచకాలకు విశాఖపట్నానికి ముప్పు వచ్చిందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు..

ఏపీకి మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి చెందుతుందని అనే వ్యాఖ్యలపై టీడీపీ నేత కేశినేని నాని మాట్లాడుతూ..రైతులు తమ బాధను చెప్పుకుంటూ ఆందోళన చేపడితే..మంత్రులే..వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారనీ..మూడు రాజధానులు కాదు 30రాజధానులు కడతాంఅంటూ బాధ్యతాయుతమైన పదివుల్లో ఉన్నవారు మాట్లాడుతున్నారని అన్నారు.  జగన్ గారూ  మీరు కోరుకుంటున్నట్లు రాష్ట్రమంతా అభివృధి చెందాలంటే కొత్తగా ఏర్పడే 25 జిల్లాలలో జిల్లాకి ఒక్కటి చప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి అంటూ కేశినేని ఎద్దేవా చేశారు.