16 టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా ?

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 03:51 PM IST
16 టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా ?

25 పార్లమెంటు స్థానాలకు TDP ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, హిందూపురం, చిత్తూరు 9 స్థానాలకు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న రామ్మోహన్ నాయుడు, అశోక్ గజపతిరాజు, మాగంటి బాబు, కేశినేని నాని, కొనకల్ల నారాయణ, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, నిమ్మల కిష్ణప్ప, శివప్రసాద్‌లే మళ్లీ పోటీ చేయనున్నారు. 

* అరకు పార్లమెంటు స్థానానికి కిషోర్ చంద్రదేవ్ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. 
* విశాఖ స్థానానికి గీతం విద్యాసంస్థల ఛైర్మన్ భరత్ పేరు పరిశీనలో ఉంది. 
* అనకాపల్లి స్థానానికి ఆడారి ఆనంద్, కాకినాడకు చలమలశెట్టి సునీల్ దాదాపు ఖరారైనట్లు సమాచారం. 
* అమలాపురం ఎంపీ స్థానానికి మాజీ ఎంపీ హర్షకుమార్ పేరు పరిశీలిస్తున్నారు. 
* రాజమండ్రికి మాగంటి రూప, ముళ్లపుడి రేణుక పోటీపడుతున్నారు. 
* నరసాపురం స్థానానికి ఉండి ఎమ్మెల్యే శివరామరాజుని ఖరారు చేశారు. 
* బాపట్ల స్థానానికి తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పేరు పరిశీలిస్తున్నారు. 
* ఒంగోలుకు శిద్దా రాఘవరావు, నెల్లూరుకు బీదా మస్తాన్ రావు పేర్లు ఖరారైనట్లు సమాచారం.
* కర్నూలుకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పేరు దాదాపు ఖాయమైంది.
* నంద్యాల పార్లమెంటు స్థానంలో మాండ్ర శివానంద్ రెడ్డికి ఓకే చెప్పారు. 
* అనంతపురం ఎంపీ స్థానంలో ఈసారి జేసీ దివాకర్ రెడ్డికి బదులుగా ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డి బరిలో దిగనున్నారు. 
* కడపకు మంత్రి ఆదినారాయణరెడ్డి పేరు ఖరారైంది. 
* తిరుపతికి పనబాకలక్ష్మికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 
* రాజంపేట పార్లమెంటు స్థానానికి సత్యప్రభ, శ్రీనివాసరెడ్డిలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉంది.