చావుతో ఆటలు : PubG ఆడుతూ నరాలు పట్టేసి.. చనిపోయాడు

ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీ(PUBG)కి బలవుతున్నవారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇప్పటికే ఈ గేమ్ భారినపడి ఇబ్బంది పడిన వ్యక్తుల గురించి రకరకాల కథనాలు వస్తుండగా.. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రాజారాంపల్లికి చెందిన సాగర్(20) అనే యవకుడు పబ్ జీకు అడిక్ట్ అయి మరో విద్యార్ధి ప్రాణాలను కోల్పొయ్యాడు. నిత్యం గేమ్ ఆడుతూ అదేపనిలో ఉండగా.. అతని నరాలు పట్టేశాయి. అతని నరాలు పట్టేయడంతో చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు అతనిని హైదరాబాద్‌కు తరలించారు.
Read Also : సోషల్ మీడియా ప్రచారం : వచ్చిన టీడీపీ టికెట్ పోయింది
అయితే 46 రోజుల పాటు చికిత్స అందించిన డాక్టర్లు యువకుని ప్రాణాలు కాపాడలేకపోయారు. పబ్‌జీ గేమ్ ఆడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి పిల్లలు చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ గేమ్ వల్ల నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా అధికం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా పబ్‌జీ గేమ్‌ను బ్యాన్ చేయాలంటూ ఇప్పటికే పలువురు డిమాండ్ చేస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు ఈ గేమ్‌ను బ్యాన్ చేశాయి. ఇది చిన్న సమస్య కాదని, ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇంకెంతమంది యువకులు ఈ గేమ్‌కు బలి కావాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
Read Also : తిరుపతిలో టెన్షన్ : నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్ట్