పిడుగుపాటుకు ఐదుగురు మృతి
తెలంగాణలోని పలుప్రాంతాల్లో వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలలో ఐదుగురు మృతి చెందారు.

తెలంగాణలోని పలుప్రాంతాల్లో వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలలో ఐదుగురు మృతి చెందారు.
తెలంగాణలోని పలుప్రాంతాల్లో వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలలో ఐదుగురు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లా చింతల చెరువు దగ్గర పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చింతలచెరువు దగ్గర పిడుగుపాటు ఘటన దురదృష్టకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గాయాలైన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సారయ్యను మంత్రి పరామర్శించారు. మృతి చెందిన ఇద్దరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తుమ్మలపల్లిలో పిడుగుపడి వ్యవసాయ కూలీ మృతి చెందాడు. భద్రాద్రి మండలం చొప్పలలో స్రవంతి అనే యువతిపై పిడుగు పడటంతో ఆమె మరణించింది. కొమురంభీం జిల్లా తిర్యాని మండలం ఖైరిగూడలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో పిడుగులు పడటంతో 5గేదెలు, 2 దూడలు మృతి చెందాయి.