తిరుమల అడవుల్లో భారీగా మంటలు

తిరుమలలోని శేషాచలం అడవుల్లో భారీగా మంటలు వ్యాపించాయి. గత రెండు రోజుల క్రితం అడవిలో చిన్నగా రాజుకున్న మంటలు క్రమంగా శేషాచలం కొండల్లోని చామలకోన, గాడికోన ప్రాంతాలకు వ్యాపించాయి. శ్రీవారి పాదాలవైపు అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు టీటీడీ అటవీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రిజర్వ్‌ఫారెస్ట్ పరిధిలోకి కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. ఈదురుగాలులు తగిలి మంటలు చెలరేగుతున్నాయి.
మంటలను అదుపు చేసేందుకు పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు కృషి చేస్తున్నాయి. వీటితోపాటు టీటీడీ వాటర్ పైప్ లైన్లతో మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవిలో ఎండిపోయిన చెత్తాచెదారం, ఆకులు ఉండటంతో.. మంటలు ఎగసిపడుతున్నాయి. కొండలో మంటల వల్ల శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్లే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.