తెగిన విద్యుత్ వైరు : నిలిచిన నాందేడ్, గరీబ్ రథ్ రైళ్లు
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పలు రైళ్లు నిలిచిపోయాయి.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పలు రైళ్లు నిలిచిపోయాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య విద్యుత్ వైరు తెగిపడిపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ స్టేషన్ లో నాందేడ్ ఎక్స్ ప్రెస్, కేసముద్రం స్టేషన్ లో గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ నిలిపివేశారు.
ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాజీపేటకు సంబంధించిన మరమ్మత్తు సిబ్బంది రంగంలోకి దిగారు. మరమ్మత్తు పనులు అయ్యాక రైళ్ల రాకపోకలను పునరుద్దరిస్తామని అధికారులు చెప్పారు.
Read Also : మీ అవసరం మాకు తెలుసు : మెట్రో కోచ్ లో ఛార్జింగ్ పాయింట్లు