కారుదే జోరు : హుజూర్ నగర్‌లో సైదిరెడ్డి ఆధిక్యం

  • Published By: madhu ,Published On : October 24, 2019 / 03:31 AM IST
కారుదే జోరు : హుజూర్ నగర్‌లో సైదిరెడ్డి ఆధిక్యం

Updated On : October 24, 2019 / 3:31 AM IST

హుజూర్ నగర్‌లో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా పక్కా ఎగురుతుందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కనబరుస్తూ వస్తున్నారు. అక్టోబర్ 24వ తేదీ గురువారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. తొలి రౌండ్‌‌లో టీఆర్ఎస్ 2 వేల 467 ఆధిక్యం సాధించగా..రెండో రౌండ్‌‌లోనూ 4 వేల మెజార్టీతో సైదిరెడ్డి ముందంజలో ఉన్నారు.

మూడో రౌండ్‌లో 6 వేల 777 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండ్‌లోనూ టీఆర్ఎస్ అధిక్యంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఏ మాత్రం ప్రభావం చూపించలేకోపోతున్నారు. ఓటర్లు కారు వైపు మొగ్గు చూపారని నేతలు అంటున్నారు. రౌండ్ రౌండ్‌కు టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం సాధిస్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ గోదాములో కౌంటింగ్ చేపడుతున్నారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

22 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుందని, ఉప ఎన్నిక తుది ఫలితం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడి కానుందని అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున
శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి కిరణ్మయి బరిలో ఉన్నారు. 
ఉదయం 9గంటల వరకు టీఆర్ఎస్ 10 వేల 704, కాంగ్రెస్ 4 వేల 223, బీజేపీ 1232, టీడీపీ 1151 ఓట్లు పడ్డాయి. 
Read More : కౌంటింగ్ స్టార్ట్…పార్టీ ఆఫీసుల్లో స్వీట్లు రెడీ