TRSలోనే ఉంటా..నామా గెలుపుకి కృషి చేస్తా :పొంగులేటి

తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సృష్టం చేశారు.టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్ననామా నాగేశ్వరరావు గెలుపునకు కృషిచేస్తానని తెలిపారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేసే ప్రతి వ్యక్తినీ సీఎం కేసీఆర్ గుర్తిస్తారన్నారు. అభిమానులు అసహనానికి, ఆవేదనకు గురికావొద్దని కోరారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ టిక్కెట్ కేటాయించిన విషయం తెలిసిందే.దీంతో పొంగులేటి పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరిగింది.అయితే అలాంటిదేమీ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.