హ్యాపీ రిసార్ట్స్ దగ్గర రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

  • Published By: chvmurthy ,Published On : September 13, 2019 / 04:04 AM IST
హ్యాపీ రిసార్ట్స్ దగ్గర రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

Updated On : September 13, 2019 / 4:04 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు పభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఆత్మకూరు మండలం హ్యాపీ రిసార్ట్స్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో రోడ్ పక్కన మార్జిన్ లో ఆపివున్న కంటైనర్ ని అశోక్ లేలాండ్ గూడ్స్ వెహికల్ ఢీ కొట్టింది. ఇందులోని వారు శ్రీకాకుళం నుంచి గుంటూరు గొర్రెల మండీకి వెళ్తున్నట్లు తెలిసింది. 

డ్రైవర్ కోటిపల్లి శాంతరావు, మరొకరు ప్రమాద స్ధలంలోనే చనిపోయారు. గాయపడిన మిగిలిన నలుగురుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.