టీడీపీకి షాక్: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

  • Published By: vamsi ,Published On : March 17, 2019 / 04:16 AM IST
టీడీపీకి షాక్: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

కడప జిల్లా తెలుగుదేశంకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి తదనంతరం తెలుగుదేశం గూటికి చేరిన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు బీజేపీలో చేరారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జయరాములు ఆ పార్టీ కండువా పుచ్చుకున్నారు. జయరాములుతో పాటు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఛైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి, మరికొందరు ఆ పార్టీలో చేరారు.

ఈ సంధర్భంగా మాట్లాడిన జయరాములు.. ప్రాంతీయ పార్టీలతో దేశానికి ఒరిగేదేమీ లేదనే ఉద్దేశంతో బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే బద్వేలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి టీడీపీలో చేరిన జయరాములుకు ఈసారి టిక్కెట్ రాకపోవడంతో పార్టీ మారినట్లు తెలుస్తుంది. 2019ఎన్నికల్లో బద్వేల్ టిక్కెట్‌ను తెలుగుదేశం.. ఓబులాపురం రాజశేఖర్‌కి కేటాయించింది.

ఇక గత ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసిన విజయజ్యోతి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో ఆమె టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.