బాబు మోచేతినీళ్లు తాగే జేడీ మాకు అక్కర్లా..

జనసేన పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఇద్దరి మధ్యా గత కొన్ని రోజుల నుంచి ట్వీట్ట దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి మరోసారి లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు.
చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే లక్ష్మీనారాయణకు మా పార్టీలో ఎన్నటికీ స్థానం ఉండదనీ..బహుశా ఆయన చేరాలనుకున్నారేమో..కానీ కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పుడు అనిపిస్తోందన్నారు. సీబీఐ లాంటి సంస్థను చంద్రబాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చేయాలని కలలు కంటున్నాననడం పెద్ద జోక్ అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఈవీఎంలపై చంద్రబాబు మతితప్పి మాట్లాడుతుంటే..ఆ మాటలను బలపరుస్తూ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగిందన్నారు. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామనే భయంతో చంద్రబాబు ఎన్నికలను రద్దు చేయాలని డిమాండు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేసిన 80 శాతం మంది ప్రజలకు లేని అనుమానాలు తుప్పు బాబుకు వస్తున్నాయి అని విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఎలాగైనా ఇరికించేందుకు బాబు అండ్ కో ఒత్తిళ్లు మొదలు పెట్టారనీ మాజీ ఏపీ సీఎస్ పునేఠా ఇప్పటికే బలిపశువయ్యారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా మంత్రివర్గానికి జవాబుదారీగా ఉండాలని సుబ్రహణ్యాన్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. నాలుగు రోజుల్లో పెట్టేబేడా సర్దుకుని పోయేవారిని పట్టించుకోనవసరం లేదని విజయసాయిరెడ్డి వరుస ట్వీట్లతో విమర్శలు సంధించారు.
చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే జేడీ గారికి మా పార్టీలో ఎన్నటికీ స్థానం లేదు. ఉండదు కూడా. బహుశా ఆయనే చేరాలనుకున్నారేమో. కోవర్టు ఆపరేషన్ల కోసం వచ్చే ఆలోచన చేశారని ఇప్పడు అనిపిస్తుంది. సీబీఐ లాంటి సంస్థను బాబుకు పాదాక్రాంతం చేసిన వ్యక్తి దేశాన్ని మార్చే కలలు కంటున్నాననడం పెద్ద జోక్.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2019
ఈవీఎంలపై చంద్రబాబు మతితప్పి మాట్లాడుతుంటే దాన్నిబలపరుస్తూ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఘోర పరాజయం తర్వాత ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండు చేసినా ఆశ్చర్యం లేదు. పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేసిన 80 శాతం మంది ప్రజలకు లేని అనుమానాలు తుప్పు బాబుకు వస్తున్నాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2019
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఎలాగైనా ఇరికించేందుకు ఒత్తిళ్లు మొదలు పెట్టారు బాబు అండ్ కో. పునేఠా ఇప్పటికే బలిపశువయ్యాడు. కోడ్ అమలులో ఉన్నా మంత్రివర్గానికి జవాబుదారీగా ఉండాలని ఎల్వీని బెదిరిస్తున్నారు. నాలుగు రోజుల్లో పెట్టేబేడా సర్దుకుని పోయేవారిని పట్టించుకోనవసరం లేదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2019