పూజారులకు రూ.1000 పింఛన్, ఉచితంగా ఇళ్లు..బ్రాహ్మణులకు దీదీ వరాలు

బ్రాహ్మణ పూజారులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. పూజారులకు నెలకు రూ.1000 అలవెన్స్ ఇవ్వనున్నామని తెలిపారు. అంతేకాదు..8 వేల మందికి పైగా పేద సనాతన బ్రాహ్మణ పూజారులకు ఉచిత ఇళ్లు ఇవ్వనున్నామని ప్రకటించారు. దీంతో బ్రాహ్మణులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.