నర్సీపట్నంలో జనసేన సపోర్ట్ ఎవరికీ?

  • Published By: vamsi ,Published On : March 29, 2019 / 03:19 AM IST
నర్సీపట్నంలో జనసేన సపోర్ట్ ఎవరికీ?

Updated On : March 29, 2019 / 3:19 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా వేగి దివాకర్ దాఖలు చేసిన నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. జనసేన అభ్యర్థి వేగి దివాకరరావు నామినేషన్‌పై జనసేన రెబల్‌ అభ్యర్థి బైయపురెడ్డి అశోక్‌ అభ్యంతరాలు లేవనెత్తడంతో వేగి దివాకర్ నామినేషన్ తిరస్కరించారు.
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష

దీంతో ఈ నియోజకవర్గం నుంచి జనసేన తరుపున రెబల్‌గా నిలబడిన అభ్యర్థి బైయపురెడ్డి అశోక్‌‌కు జనసేన సపోర్ట్ ఉంటుందని భావించారు. అయితే  నర్సీపట్నం జనసేన రెబల్‌ అభ్యర్థి బైయపురెడ్డి అశోక్‌‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఇప్పుడు జనసేన క్యాడర్ నియోజకవర్గంలో ఎవరికి సపోర్ట్ చేస్తుందనే విషయం తెలియట్లేదు. 
Read Also : ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు బ్రేక్