అమరావతి శంకుస్థాపన చేసిన చోటే మా సమాధులు కట్టండి

ఏపీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన చోటే మా సమాధులు కట్టండి అంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రకటించటం..సీఎన్ రావు కమిటికి దానికి సంబంధించని రిపోర్ట్ కూడా ఇవ్వటంతో అమరావతి ప్రాంతంలోని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులతో సహా మహిళలు కూడా రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తచేస్తున్నారు.
ఈ క్రమంలలో రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మహిళలు, రైతులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా ఓ మహిళ మాట్లాడుతూ..సాక్షాత్తు దేశ ప్రధానిగారు వచ్చి అమరావతిని రాజధానిగా అంగీకరిస్తు శంకుస్థాపన చేశారని..ఇప్పుడు సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ రాజధానికి భూములిచ్చిన తమ జీవితాలతో ఆడుకుంటున్నారనీ..అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే మా సమాధులు కూడా కట్టండి అంటూ తీవ్ర ఆదేదన వ్యక్తంచేస్తున్నారు మహిళలు.
ప్రధాని మోడీగారూ..ఏపీ రాజధాని ప్రజలందరి చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తున్నాం సార్..మాకు న్యాయం చేయండి..తమకు ఉన్న భూముల్ని రాజధానికి ఇచ్చామని కానీ ఇప్పుడు తమ జీవితాలు..తమ పిల్లలు భవిష్యత్తులను అంధకారంగా మార్చేలా సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మీరు ఆరోజున ఏమైతే అన్నారో..ఆనాటి సీఎం చంద్రబాబు అమరావతికి భూములిచ్చిన రైతులకు ఎటువంటి అన్యాయం జరగదనీ..మాటిచ్చారనీ కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. అధికారం వేరే పార్టీకి వెళ్లింది..అంతమాత్రాన తమకు ప్రభుత్వం ఇచ్చిన మాటలను తుంగలో తొక్కి తమకు అన్యాయం చేస్తున్నారనీ దీనికి కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు.
తాము భూములిచ్చింది ప్రభుత్వానికి కానీ పార్టీలకు కాదనీ..ఈ విషయాన్ని సీఎం జగన్ కు అర్థం కావటంలేదాని ప్రశ్నించారు. అవగాహన లేకుండా ఇటువంటి నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని విమర్శించారు.
అమరావతి రాజధానికి అనుకూలమని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆనాడు అంగీకరించారనీ..మాట తప్పను మడమ తిప్పను అనే సీఎం జగన్ ఈనాడు మాట తప్పారనీ..మడమ తిప్పారనీ..సీఎం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై మహిళలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.