బీసీలు చంద్రబాబు తోక కత్తిరించి పక్కన కూర్చోబెట్టారు : రోజా

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బీసీలను అవమానించారనీ..బీసీలకు తోక ఎక్కువ..వారి తోకను కత్తిరించాలంటూ వారిని అవమానించారనీ అందుకే ఎలక్షన్ లో బాబు తోకను బీసీలు కత్తిరించి పక్కన కూర్చోపెట్టారని వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారనీ..జగన్ సీఎం అయ్యాక రీ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయాల్ని ఆదా చేశారని రోజా ప్రశంసించారు.
రాష్ట్రంలో మద్యం విక్రయాలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనీ..దీంట్లో భాగంగా..ఇప్పటికే 25 శాతం మద్యం షాపులు, 40 శాతం బార్ లను తగ్గించామని రోజా అన్నారు. కానీ చంద్రబాబు పాలనలో మద్యం ఏరులైనా పారిందని కానీ ప్రజల క్షేమం కోసం తమ ప్రభుత్వం మద్య నిషేధాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. దీంట్లో భాగంగానే విడతవారీగా బెల్ట్ షాపులను బంద్ చేస్తున్నామని అన్నారు.