పవన్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడేమో : విజయ్ సాయి రెడ్డి 

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 08:53 AM IST
పవన్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడేమో : విజయ్ సాయి రెడ్డి 

Updated On : December 4, 2019 / 8:53 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డ్రగ్స్ మత్తులో ఉన్నాడేమోనని తమకు అనుమానంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ లో ఉన్న అజ్ఞాతవాసి అప్పుడప్పుడు బైటకు వస్తుంటాడనీ..అందుకే తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడని అన్నారు. 

రేపిస్టులకు ఉరిశిక్ష ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నాడంటే మానసిక స్థితిలో ఏదో సీరియస్ ప్రాబ్లమ్ ఉన్నట్టే. దిశ హత్యాచారం కేసులో దోషులకు కఠినంగా శిక్షించాలని  దేశమంతా డిమాండ్ చేస్తూ కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయి. పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. 

చిత్తరూ జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా పవన్ కు కౌంటర్ ఎటాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఇలా పవన్..వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు కొనసాగుతున్నాయి.