జగన్ విజయయాత్ర : బాబును నమ్మమని అంటున్నారు – జగన్

శ్రీకాకుళం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అందరికీ మోసమే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా పాతబస్టాండులో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. రైతులు, మహిళా సంఘాలు, నిరుద్యోగులకు..ఇలా ఏ ఒక్కరికి కూడా బాబు న్యాయం చేయలేదన్నారు. అబ్దాలు చెప్పే బాబును ఎవరూ నమ్మడం లేదని..స్వయంగా రైతులే..మహిళలు చెబుతున్నారని తెలిపారు. రైతులందరికీ వడ్డీ లేకుండా డబ్బులిస్తే…బాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం వడ్డీ డబ్బులు పూర్తిగా కట్టలేదన్నారు. బాబును నమ్మం అంటూ రైతులు చెబుతున్నారన్నారు. హెరిటేజ్ షాపుల్లో లాభాల కోసం రైతన్న దగ్గరి నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి..హెరిటేజ్ షాపుల్లో మాత్రం మూడింతల రెట్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.