Swati Maliwal: బతికి ఉన్నంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాను: ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్

Swati Maliwal
Swati Maliwal: ఓ వ్యక్తి తనను వేధించాడంటూ ఇటీవల ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలీవాల్ చేసిన ఆరోపణల్లో నిజం లేదంటూ కొందరు విమర్శలు గుప్పిస్తుండడంతో స్వాతి స్పందించారు. తన గురించి ఘోరమైన అసత్యాలు చెబుతూ తనను బెదిరించాలని కొందరు చూస్తున్నారని చెప్పారు.
ఈ చిన్న జీవితంలో తాను ఎన్నో పెద్ద పెద్ద కార్యాలు చేశానని తెలిపారు. తనపై చాలాసార్లు దాడులు జరిగాయని, అయినప్పటికీ తన పోరాటాన్ని, దాడి జరిగిన ప్రతిసారి తనలోని అగ్ని మరింత రగులుతుందని చెప్పుకొచ్చారు. తన గళాన్ని ఎవరూ అణచివేయలేరని అన్నారు. తాను బతికి ఉన్నంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు.
కాగా, తాను ఇటీవల అర్ధరాత్రి దాటక రోడ్డు పక్కన ఉన్న సమయంలో ఓ వ్యక్తి తనను వేధించాడని స్వాతి మలీవాల్ చెప్పిన విషయం తెలిసిందే. తన ముందు ఓ కారు ఆగిందని, అందులోని డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడని ఆమె తెలిపింది. తాను అతడితో వాదిస్తూ కారులోపలికి చేతిని పెట్టడంతో అదే సమయంలో కారు అద్దాన్ని మూసేశాడని, తనను 10-15 మీటర్ల దూరం లాక్కెళ్లాడని ఆమె ఆరోపించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ వ్యాప్తంగా కలకలం రేపాయి. అయితే, ఆమె చేసిన ఆరోపణలపై కొందరు నెటిజన్లు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆమె అసత్యాలు చెప్పారని అంటున్నారు.
10-15 नही इस विडियो में तो दिख रहा है पूरे 100 मीटर तक ले कर गया है।? pic.twitter.com/9wfuZmCThV
— manish_wassup ???? (@wassup_manish) January 21, 2023
Bombay High Court : కస్టోడియల్ మృతి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు జరిమానా