Elephant Mimics Little Girl’s Dancing: బాలికను అనుకరిస్తూ ఏనుగు డ్యాన్స్.. వీడియో వైరల్

ఏనుగులంటే చిన్న పిల్లలకు చాలా ఇష్టం. వాటిని చూడాలని ముచ్చటపడుతుంటారు. ఏనుగు తొండం సహా దాని ఆకారం పిల్లలను ఆకర్షించేలా చేస్తుంది. ఏనుగును చూస్తే సంతోషంతో గంతులు వేస్తుంటారు. తాజాగా, ఓ ఏనుగును చూసిన ఆనందంతో ఐదేళ్ల ఓ బాలిక డ్యాన్స్ చేసింది. దీంతో ఆ ఏనుగు ఆ బాలికను అనుకరిస్తూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Elephant Mimics Little Girl’s Dancing: బాలికను అనుకరిస్తూ ఏనుగు డ్యాన్స్.. వీడియో వైరల్

Elephant Mimics Little Girl's Dancing

Updated On : September 18, 2022 / 1:00 PM IST

Elephant Mimics Little Girl’s Dancing: ఏనుగులంటే చిన్న పిల్లలకు చాలా ఇష్టం. వాటిని చూడాలని ముచ్చటపడుతుంటారు. ఏనుగు తొండం సహా దాని ఆకారం పిల్లలను ఆకర్షించేలా చేస్తుంది. ఏనుగును చూస్తే సంతోషంతో గంతులు వేస్తుంటారు. తాజాగా, ఓ ఏనుగును చూసిన ఆనందంతో ఐదేళ్ల ఓ బాలిక డ్యాన్స్ చేసింది. దీంతో ఆ ఏనుగు ఆ బాలికను అనుకరిస్తూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కాబ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే బాగా వైరల్ అయింది. ‘ఎవరు బాగా డ్యాన్స్ చేశారు?’ అని ఆయన పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ బాగా డ్యాన్స్ చేశారని కొందరు పేర్కొన్నారు. ఏనుగులకు కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయని ఈ వీడియో ద్వారా తెలుస్తోందని ఒకరు కామెంట్ చేశారు. ఏనుగులకు డ్యాన్స్ నేర్పించిన తొలి కొరియోగ్రాఫర్ గా ఈ చిన్నారి నిలుస్తుందని కొందరు నెటిజన్లు కామెంట్లు  చేశారు.


5,664 fresh COVID-19 cases: దేశంలో కొత్తగా 5,664 కరోనా కేసులు.. నిన్న 14,84,216 వ్యాక్సిన్ డోసుల వినియోగం