Marriage: పెళ్లి కూతురు సిగ్గు, పర్ఫామెన్స్ ఇరగదీస్తున‍్న పెళ్లికొడుకు – వీడియో
కరోనా వ్యాప్తి కారణంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఇక ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. కరోనా కారణంగా అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి తంతు చాలా సాదాసీదాగా జరిగిపోతుంది.

Marriage (2)
Marriage: కరోనా వ్యాప్తి కారణంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఇక ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. కరోనా కారణంగా అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి తంతు చాలా సాదాసీదాగా జరిగిపోతుంది. బంధువులు కూడా పెళ్లిళ్లకు, వేడుకలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మేళతాళాలు కూడా పెట్టుకోవడం లేదు కొందరు.
పెళ్లిదగ్గర 40 మందికి మించకూడదని నిబంధలు ఉండటంతో పెళ్ళివారు భజంత్రిలను కూడా పెట్టడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ పెళ్లిలో పెళ్లికొడుకు తన పెళ్ళికి తానే డబ్బుకొట్టుకున్నాడు. భజంత్రీలు లేకపోవడంతో పెళ్ళికొడుకు ఈ విధంగా చెయ్యాల్సి వచ్చింది. ఇక దీనికి సంబందించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపీస్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ వీడియోలో పెళ్లి తర్వాత పెళ్లి కుమారుడు మండపం దిగి డబ్బు వాయిస్తుంటే పక్కనే ఉన్న పెళ్లికూతురు సిగ్గుపడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. పెళ్లి కొడుకే కానీ పక్కా ప్రొఫెషనల్ డ్రమ్స్ వాయిస్తున్నాడని ఓ నెటిజన్ అంటుంటే.. నా పెళ్లికి నేను డప్పు కొట‍్టుకుంటున్నా.. మీ పెళ్లికి మీరే డప్పు కొట్టుకోవాలంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
#Atmanirbhar Dulha pic.twitter.com/STRlOaPXRM
— Rupin Sharma IPS (@rupin1992) May 12, 2021