గడ్డ కట్టే చలిలో 2 ఏళ్ళ పాప డాన్స్ వైరల్

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 10:40 AM IST
గడ్డ కట్టే చలిలో  2 ఏళ్ళ పాప  డాన్స్  వైరల్

Updated On : February 8, 2020 / 10:40 AM IST

టెక్సాస్ లో ఉంటున్న 2 ఏళ్ళ చిన్నారి మాడెలిన్ ఎల్సా లాంటి ప్రాక్ ను ధరించి ఎంతో ఆనందంతో మంచులో డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

చిన్న పిల్లలు తమ ఇష్టమైన కార్టూన్ షో లను చూస్తూ, ఆ పాత్రలో వారు ఎలా ఉంటారో అని ఊహించుకుంటారు. అలాంటిదే ఓ చిన్నారి తనకి ఎంతో ఇష్టమైన ‘ఫ్రాజెన్’ సినిమాలోని ‘ఎల్సా’ యువరాణి పాత్రను అనుకరించింది. అచ్చం ఫ్రాజెన్ సినిమాలో ఎల్సా ధరించిన లాంటి ప్రాక్ ను ధరించింది. తనే యువరాణి లాగా ఫీల్ అవుతూ ఎంతో ఆనందంతో మంచులో పాటలు పాడుతూ, డాన్స్ చేస్తుంది. 

 

ఇక వివరాల్లోకి వెళ్లే.. ఫిబ్రవరి లో టెక్సాస్ లో కురిసిన మంచు తుఫాన్ తో ఆ చిన్నారి  డ్రీమ్ ను సాకారం చేసుకోనే చాన్స్ వచ్చింది. దాంతో తనని బయటకు పంపమని కోరినట్లు మాడెలిన్ తల్లి క్రిస్టీ మైకాలే చెప్పింది.  ఫ్రాజెన్ సినిమాలో యువరాణి ఎల్సా ధరించిన లాంటి ప్రాక్, షూ, కీరిటం ధరించి ‘లెట్ ఇట్ గో’ పాటను ముద్దు ముద్దుగా పాడుతూ, డాన్స్ చేయటం వీడియోలో కనిపిస్తుంది. మాడెలిన్ తల్లి సరదా తీసిన 2 ఏళ్ళ చిన్నారి మంచులో ఆడుతూ, పాడుతూ, డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

 

ఈ వీడియోకి ఇప్పటి వరకు 30 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. కొంత మంది నెటిజన్లు చిన్నారిని చూటానికి నటిలా ఉంది, ఎల్సానే గుర్తుకు తెచ్చే విధంగా ఉంది. ఆ చిన్నారి ముద్దుగా డాన్స్ చేసిన వీడియోని షేర్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.