ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ ట్వీట్

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 05:41 AM IST
ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ ట్వీట్

Updated On : December 28, 2019 / 5:41 AM IST

ప్రముఖ బిజినెస్ మేన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిన విషయమే. స్పూర్తినిచ్చే వీడియోలు, ఫన్నీ పోస్టులను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి స్వీట్ షాప్ ముందు కూర్చుని ఫోన్ లో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియోని ఆయన షేర్ చేశారు. ఇప్పుడీ ఈ వీడియో వైరల్ గా మారింది.

విషయం ఏంటంటే.. ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి మూగవాడు. సైగలతోనే అవతలి వ్యక్తికి విషయాన్ని చెబుతాడు. ఇది మహీంద్రాకు బాగా నచ్చింది. దాంతో వీడియోని ట్విటర్ లో పోస్ట్ చేశాడు.

మాటలు రాని వ్యక్తి తన సైగలతో విషయాన్ని చెప్పడం చాలా కొత్తగా అనిపించిందని మహీంద్రా తెలిపారు. మాటలు రాని వారందరు సైగలతో మాట్లాడుకునేందుకు వీలుగా మెుబైల్ ఫోన్ లో వీడియో కాలింగ్ ఆప్షన్ వచ్చి ఉండవచ్చని ఆనంద్ మహీంద్రా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.