Australian Deputy PM : ఢిల్లీ వీధుల్లో నిమ్మరసం తాగిన రిచర్డ్ మార్లెస్…వీడియో వైరల్

ఆస్ట్రేలియన్ ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ నగరంలో రోడ్డు పక్కన స్టాల్ లో ప్రసిద్ధ చాట్ లో రిచర్డ్ మార్లెస్ రుచికరమైన రామ్ లడ్డూ తిని, నింబూపానీ తాగారు....

Australian Deputy PM : ఢిల్లీ వీధుల్లో నిమ్మరసం తాగిన రిచర్డ్ మార్లెస్…వీడియో వైరల్

Australian Deputy PM

Updated On : November 21, 2023 / 1:26 PM IST

Australian Deputy PM : ఆస్ట్రేలియన్ ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ నగరంలో రోడ్డు పక్కన స్టాల్ లో ప్రసిద్ధ చాట్ లో రిచర్డ్ మార్లెస్ రుచికరమైన రామ్ లడ్డూ తిని, నింబూపానీ తాగారు. ఆదివారం గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి భారతదేశానికి వచ్చిన ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ ఢిల్లీ నగరంలో తిరిగి పలు స్థలాలను చూశారు.

ALSO READ : Shubman Gill : ఇది అంతం కాదు.. గెలిచేవరకు పోరాటం ఆగదు : శుభ్‌మన్ గిల్

ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ క్రికెట్ కప్‌ను గెలుచుకోవడంతో మార్లెస్ ఢిల్లీలో ఖుషీఖుషీగా తిరిగారు. నింబూపానీ తాగిన రిచర్డ్ స్టాల్ యజమానికి యూపీఐ ద్వారా డబ్బు చెల్లించారు. నింబూపానీ కోసం యూపీఐను ఎలా ఉపయోగించాలో ఆయన వెంట ఉన్న అధికారులు అతనికి చూపించారు. ఆస్ట్రేలియన్ ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ నింబూపానీ తాగి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.