Shubman Gill : ఇది అంతం కాదు.. గెలిచేవరకు పోరాటం ఆగదు : శుభ్‌మన్ గిల్
Shubman Gill : ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Shubman Gill pens message after India's World Cup Final loss against Australia
Shubman Gill : ప్రపంచకప్ మళ్లీ చేజారింది. ఆస్ట్రేలియా ఆరోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. టీమిండియా ప్రాణం పెట్టి ఆడినప్పటికీ ఫలితం మళ్లీ నిరాశే మిగిల్చింది. ఈసారైన ప్రపంచ కప్ చేజిక్కించుకుందామని భావిస్తే.. ఆసీస్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా విశ్వవిజేతగా నిలిచింది. దాంతో టీమిండియా ప్లేయర్లు సహా భారతీయ క్రికెట్ అభిమానులంతా ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ చేజారడంతో కన్నీటీపర్యంతమవుతున్నారు. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగానికి లోనయ్యాడు.
Read Also : Virat Kohli : ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీకి ప్రత్యేక బహుమతి ఇచ్చిన సచిన్..
ఓటమి బాధ ఇంకా తగ్గట్లలేదు :
‘దాదాపు 16 గంటల పైనే గడిచాయి. కానీ గత రాత్రి ఓటమి తీరని బాధను మిగిల్చింది. కొన్నిసార్లు ఎంతగా శ్రమించినా ఆశించిన ఫలితం రాదు. ఈ ప్రయత్నంలో అంతిమ లక్ష్యాన్ని సాధించలేకపోయాం. కానీ, ఈ ప్రయాణంలో ప్రతి అడుగు విలువైనదే.. ఆటలో గెలుపు ఓటములు అనేవి సహజం.. ఓటమిలో కూడా వెన్నంటి నిలబడిన అభిమానులే మాకు కొండంత ధైర్యం.. ఇది అంతం కాదు.. మనం గెలిచే వరకు ఇది ముగియదు. జై హింద్’ అని గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
4 పరుగులకే పరిమితమైన గిల్ :
డెంగ్యూ జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు భారత్ ఓపెనర్ గిల్ దూరమయ్యాడు. పాకిస్థాన్‌తో జరిగిన భారత్ హెవీవెయిట్ పోరులో తిరిగి జట్టులోకి వచ్చాడు. మొత్తం 9 మ్యాచ్‌లలో 44.25 సగటుతో 106.94 వద్ద స్ట్రైకింగ్‌తో 354 పరుగులు చేశాడు. 24 ఏళ్ల గిల్ టోర్నమెంట్‌లో 4 అర్ధ సెంచరీలు సాధించాడు. న్యూజిలాండ్‌పై అజేయంగా 80 పరుగులు నమోదు చేశాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో గిల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
2003 ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో భారత్ 2023 ప్రపంచ్ కప్ టోర్నీలో ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ఫైనల్ వరకు దూసుకొచ్చింది. ఫలితంగా రోహిత్ సేన వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అయితే (నవంబర్ 19 ఆదివారం) ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చేతులేత్తేసింది.
ఈ తుదిపోరులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ 43 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ట్రావిస్ హెడ్(137) సెంచరీ, లబూషేన్(58 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఆరో వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంది.
View this post on Instagram