చెత్తకుప్పలో 14 లక్షలు పడేసిన జంట.. అసలు విషయమేంటంటే!

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 02:21 PM IST
చెత్తకుప్పలో 14 లక్షలు పడేసిన జంట.. అసలు విషయమేంటంటే!

Updated On : December 30, 2019 / 2:21 PM IST

మీరు ఎప్పుడైనా డబ్బులను చెత్తకుప్పలో పడేశారా? కనీసం ఎవరైనా పడేస్తుంటే చూశారా.. అదేం ప్రశ్నా అసలు డబ్బులు ఎవరైనా పడేస్తారా, వీలైతే బ్యాంకులో దాచుకుంటాం, లేకపోతే ఏదైనా వస్తువు కొనుక్కుంటాం అనుకుంటున్నారు కదు. కానీ.. UKకు చెందిన ఓ జంట ఏకంగా రూ.14 లక్షల నగదును చెత్తకుప్పలో పడేశారు. అయితే, అది వారు కావాలని చేసిన పని కాదు, తెలియకుండా చేసి పని.

అసలు విషయమేంటంటే.. బర్న్హమ్‌ లో ఓ జంట చనిపోయిన తన బంధువు ఇంటిని శుభ్రం చేసి పనికిరాని చెత్తని, వస్తువులను కారులో వేసుకుని డంపింగ్ యార్డులో పడేశారు. అక్కడ చెత్తను వేరు చేసే కార్మికులు సంచుల్లో ఉన్న రూ.14 లక్షలు చూసి షాకయ్యారు. ఆ డబ్బులో కనీసం ఒక నోటును కూడా వారు తీసుకోలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని రూ.14 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీసీటీవీ కెమేరాలను పరిశీలించి కారులో ఓ జంట అక్కడికి వచ్చి డబ్బుల సంచి పడేసి వెళ్లినట్లు తెలుసుకున్నారు. కారు నెంబరు ఆధారంగా ఆ జంట ఇంటికి వెళ్లిన పోలీసులు.. వారిని పశ్నించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే వారిద్దరూ ఆశ్చర్యపోయి తాము ఇంటిని శుభ్రం చేస్తుండగా వచ్చిన చెత్త అని, అందులో డబ్బులు ఉన్న సంగతి మాకు తెలియదని చనిపోయిన మహిళకు డబ్బును ఇంట్లో వస్తువుల మధ్య, దాచుకునే అలవాటు ఉందేమో అని తెలిపారు. దీంతో పోలీసులు ఆ డబ్బును వారికి తిరిగి ఇచ్చేశారు. అంతేకాదు పోలీసులు డంపింగ్ యార్డులో సిబ్బందిని అభినందించారు.