వీడియో వైరల్ : దిగుతూనే విమానం భయపెట్టేసింది

లండన్ లో భారీ గాలితో కూడిన డెన్నిస్ తుఫాన్ అందరిని వణికిస్తోంది. అక్కడ అతి వేగంగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల ఒక విమానం తన గతిని తప్పి అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన హీత్రో విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
డెన్నిస్ తుఫాన్ ప్రభావం అక్కడ ఉన్న విమాన సర్వీసులపై పడుతోంది. హీత్రో విమానాశ్రయంలో ఓ జెట్ విమానం ఊహించని రీతిలో ల్యాండింగ్ అయ్యింది. అప్పటికే అక్కడ వీస్తున్న గాలులు ప్రభావంతో ఎతిహాడ్ ఎయిర్ బస్ ఎ380 విమానం చిన్నగా ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో గాలులు భారీగా వీస్తున్నటంతో విమానం తన గతిని తప్పి రన్ వేపై ఒరుగుతూ ఒక ప్రక్కకు దూసుకు వెళ్లింది.
విమానం రన్ వేపై ఒక ప్రక్కకు ఒరుగుతూ ల్యాండ్ అయ్యింది. దాంతో లోపల ఉన్న ప్రయాణికులు చాలా భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది. అతిగా వీస్తున్న గాలులు, ఫైలట్ సమయస్పూర్తి కారణంగా విమానం ప్రక్కకు ఒరిగినప్పటికి సేఫ్ గా ల్యాండింగ్ అవటంతో అందరు ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ తుఫాన్ కారణంగా పలు రకాల విమాన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
గత కొన్ని వారాల్లో యూకేలో ఇలాంటి తుఫాన్ రావటం ఇది రెండోసారి. ఈ తుఫాన్ వల్ల అక్కడ భారీ గాలులుతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నెలరోజుల పాటు కురిసే వర్షం రెండు రోజుల్లోనే కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ 594 హెచ్చరికలను జారీ చేసినట్లు అధికారులు చెప్పారు.