13 years lost camera : మత్స్యకారుడికి దొరికిన 13 ఏళ్ల నాటి కెమెరా.. ఆ కెమెరా ఎవరిదంటే ?

ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి దొరకడం చాలా కష్టం. అందులోనూ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయిన కెమెరా తిరిగి దొరుకుతుందా? ఆ కెమెరాలో ఫోటోలు 13 ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా ఉంటాయా? తిరిగి పోగొట్టుకున్న వారికి అవి చేరతాయా? చదవండి.

13 years lost camera : మత్స్యకారుడికి దొరికిన 13 ఏళ్ల నాటి కెమెరా.. ఆ కెమెరా ఎవరిదంటే ?

13 years lost camera

Updated On : April 5, 2023 / 1:04 PM IST

13 years lost camera :  ఫోటో (photo) మనకి మధురమైన జ్ఞాప‌కాల్ని పంచుతుంది. ఎన్నో సందర్భాల్లో మనం తీసుకున్న ఫోటోలు తిరిగి చూసుకున్నప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. టెక్నాలజీ పెరిగి ఇప్పుడంతా సెల్ ఫోన్లలో ఫోటోలను బంధిస్తున్నారు. ఒకప్పుడు స్టూడియోలకి వెళ్లి ఫోటోలను తీయించుకుని ఆల్బమ్స్ లో వాటిని భద్రంగా దాచుకునేవారు. అయితే ఓ మహిళ 13 ఏళ్ల క్రితం తన కెమెరాను పోగొట్టుకుంది. ఆ తరువాత ఆ విషయాన్ని మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ కెమెరా ఓ మత్స్యకారుడికి (fisherman) దొరకడంతో ఆ కెమెరాలో ఏ ఫోటోలు ఆమె మిస్ చేసుకుందో అవి ఆమెకు తిరిగి చేరాయి. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Spy Pigeon: సాముద్ర తీరంలో గూఢచర్య పావురం .. కాళ్లకు కెమెరాలు, మైక్రో చిప్‌లు ..

స్పెన్సర్ గ్రీనర్ (Spencer Greiner) అనే వ్యక్తి US లోని కొలరాడోలోని (Colorado) అనిమాస్ నదికి (Animas River ) వెళ్లాడు. అక్కడ అతనికి అక్కడ మట్టిలో పాత కెమెరా (old camera) ఒకటి దొరికింది. అసలు అది పనిచేస్తోందా? లేదా .. అందులో ఏం ఫోటోలు ఉన్నాయనే క్యూరియాసిటీ కలిగింది. వెంటనే కంప్యూటర్ కి కనెక్ట్ చేసి చూసాడు. అందులో ఒక లేడీ విహారయాత్రకు వెళ్లినపుడు తీసుకున్న ఫోటోలుగా గుర్తించాడు. అవి ఎవరివో గుర్తించమని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

అయితే ఈ కెమెరాలోని ఫోటోలు కోరల్ అమై (Coral Amayi) అనే మహిళకు చెందినవిగా తెలిసింది. జూలై 3, 2010న  రివర్ ట్యూబింగ్ ట్రిప్‌లో ఆమె తన కెమెరాను పోగొట్టుకుంది. అమై సంబంధించిన డాగ్, తన ఫ్రెండ్స్ ఫోటోలు ఆ కెమెరాలో ఉన్నాయి. ఆ ఫోటోలను ఆమె తిరిగి ఎప్పటికీ పొందలేనని భావించిందట.  గ్రీనర్ ఫేస్ బుక్ పోస్ట్ ఫాలో అయ్యే వారంతా అమై కి ట్యాగ్ చేయడంతో చివరికి అది ఆమె కెమెరాగా గుర్తించారు.

Temjen Imna: అందమైన అమ్మాయిలతో నాగాలాండ్ మంత్రి గ్రూప్ ఫోటో.. ఆయన చూపులు మాత్రం..

ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాల తరువాత గ్రీనర్ కారణంగా తన ఫోటోలు తిరిగి పొందగలినందుకు అమై సంతోషాన్ని వ్యక్తం చేసిందట. సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది పోగొట్టుకున్న వస్తువులు, దూరమైన వ్యక్తుల్ని తిరిగి ఎలా పొందగలుగుతున్నారో.. ఇప్పుడు మిస్సయిన కెమెరా.. ఫోటోలు కూడా.