Viral Video : ఐఫోన్ ఎత్తుకెళ్లిన వానరం.. లంచంగా ఏమిస్తే తిరిగిచ్చిందో తెలుసా?

కోతుల చేసే వింత చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తాయి. ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తాయి. ఓ వ్యక్తి నుండి ఐఫోన్ ఎత్తుకెళ్లిన కోతి ముప్పు తిప్పలు పెట్టింది.

Viral Video : ఐఫోన్ ఎత్తుకెళ్లిన వానరం.. లంచంగా ఏమిస్తే తిరిగిచ్చిందో తెలుసా?

Viral Video

Updated On : January 17, 2024 / 5:46 PM IST

Viral Video : కోతులకు కావాల్సిన వస్తువు ఉండదు.. అక్కర్లేనిది ఉండదు. ప్రతీది ఎత్తుకెళ్తాయి. వాటికి కావాల్సిన వాటికోసం జనాల మీదకి దాడులు కూడా చేస్తుంటాయి. వీటి బెడద ఇండియాలో చాలానే చోట్ల ఉంటుంది. ఐఫోన్ ఎత్తుకెళ్లిన ఓ వానరం దానికి లంచంగా ఏమిస్తే ఫోన్ తిరిగిచ్చిందో చూడండి.

Sandwich Bag : ఈ బ్యాగ్ ధర అక్షరాలా రూ.2.8 లక్షలు.. అంత ధర ఎందుకంటే?

మధుర, బృందావనంలలో కోతుల బెడద ఎక్కువగానే ఉంటుంది. మనుష్యుల నుండి వస్తువులను లాక్కోవడం వాటిని తిరిగి తీసుకునేటప్పుడు ముప్పు తిప్పలు పెట్టిన సంఘటనలు అనేకం చూస్తుంటాం. తాజాగా బృందావనంలో ఓ వ్యక్తి ఐఫోన్ ఎత్తుకెళ్లింది ఓ వానరం. శ్రీరంగనాథ్ జీ మందిరంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli : మైదానంలో విరాట్ కోహ్లీ వద్దకు దూసుకొచ్చి కాళ్లు పట్టుకున్న అభిమాని.. వీడియో వైరల్

రెండు వానరాలు గోడపై కూర్చున్నాయి. వాటిలో ఒకటి ఐఫోన్ పట్టుకుంది. కింద గుమిగూడిన జనం దానిని నుండి ఫోన్ తిరిగి ఎలా తీసుకోవాలా? అని పరేషాన్ అవుతున్నారు. రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు ఆ వానరంకి ఫ్రూటీ ప్యాకెట్ విసిరారు. అంతే దానిని పట్టుకున్న కోతి చేతిలో ఉన్న ఫోన్‌ని వదిలేసింది. వెంటనే అప్రమత్తమైన వ్యక్తి ఫోన్‌ను క్యాచ్ పట్టుకున్నాడు. ‘బృందావనంలో కోతులు’ అనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదే వస్తు మార్పిడి విధానం’ అంటూ నెటిజన్లు కామెడీగా స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Vikas? (@sevak_of_krsna)