Cyclone Fengal : తీరాన్ని తాకిన ఫెంగాల్ తుపాను.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు.

Cyclone Fengal Landfall (Photo Credit : Google)
Cyclone Fengal : ఫెంగాల్ తుపాను తీరాన్ని తాకింది. తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలోని కారైకాల్-మహాబలిపురం మధ్య తుపాను తీరాన్ని తాకింది. ఇది తీరాన్ని పూర్తిగా తాకేందుకు మరో 4 గంటల సమయం పడుతుందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో తమిళనాడు-పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరాన్ని తాకుతున్న సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తుపాను తీరాన్ని తాకిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు.
ఫెంగల్ తుపాను ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. చాలా జిల్లాల్లో దీని ప్రభావం ఉంది. ఉదయం నుంచి వానలు పడుతున్నాయి. తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం ఉంటుందన్న ప్రాంతంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, తగిన ఏర్పాట్లు ముందే చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అంతా అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. ఫెంగాల్ తుపాను తీరాన్ని తాకుతున్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఈదురుగాలులు వీస్తున్నాయి. తమిళనాడు, దాని సమీపంలో ఉన్న నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని, ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
Also Read : ఈ కేసు కాకపోతే మరొకటి.. కొడాలి నానిని మాత్రం వదిలేది లేదంటున్న కూటమి సర్కార్..!