ఢిల్లీని అలుముకున్న పొగమంచు

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 01:09 AM IST
ఢిల్లీని అలుముకున్న పొగమంచు

Updated On : January 19, 2019 / 1:09 AM IST

ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. దట్టంగా మంచు అలుముకోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యానికి మంచు కూడా తోడు కావడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు. దీనితో వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. దట్టంగా పొగమంచు కారణంగా విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని విమానాలు, రైళ్లను రద్దు చేయగా మరికొన్ని ఆలస్యంగా రాకపోకలు సాగుతున్నాయి.