Himayat Sagar: మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్.. హిమాయత్ సాగర్ కు భారీగా వరద..

భారీ వర్షాల నేపథ్యంలో మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి.

Himayat Sagar: మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్.. హిమాయత్ సాగర్ కు భారీగా వరద..

Updated On : August 8, 2025 / 1:12 AM IST

Himayat Sagar: మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. వరద పోటెత్తడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒక గేటును ఓపెన్ చేశారు అధికారులు. రిజర్వాయ్ ఒక గేటు అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. భారీ వరద కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.

హైదరాబాద్ లో వర్షం కుమ్మేసింది. 3 గంటలుగా నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి నగరం నరకంలా మారింది. నగరంలో ఎటు చూసినా నీళ్లే. కుండపోత వానతో నగరంతా నీటిమయమైంది. దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడట్రాఫిక్ జామ్ అయ్యింది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, షేక్ పేట్, మణికొండ ఇలా అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖలకు సీఎం రేవంత్ ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పబ్లిక్ కు సూచించారు. గచ్చిబౌలిలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శేరిలింగంప పల్లి కాజాగూడ ప్రాంతంలో 12
సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట్ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.